నాడు నేడు పనులు- ఆర్ జెడి కి వినతి
కడప RJD గారికి జిల్లాలోని పలు విద్యారంగ సమస్యల పై ప్రాతి నిధ్యం
10.06.2020 : జిల్లాలో నాడు నేడు పనుల గురించి ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నా రని, వారిని పర్య వేక్షణ బాధ్య త ల నుంచి తప్పించాలని UTF జిల్లా ప్రధాన కార్యదర్శి J. సుధాకర్,జిల్లా శాధ్యక్షుడు S.M.జయరాజు RJD గారిని డిమాండ్ చేశారు.సందేహాలు నివృత్తి చేసుకోవడానికి విద్యా ర్థులను బ్రిడ్జి కోర్సు పేరుతో స్కూళ్లకు రమ్మంటున్నారని కానీ కరోన వలన తల్లిదం డ్రులు తమ పిల్లలను స్కూళ్లకు పంపడానికి భయపడుతు న్నా రని,పాద రక్ష ల కొలతలు కు కూడా కరోన వలన 30 శాతం మించి విద్యా ర్థులు పాఠశాల లకు రావడం లేదని వారు RJD గారి దృష్టి కి తీసుకు పోయారు.
ఒకవైపు ఆగస్టు 3 పాఠశాలలు ప్రారంభం అంటూనే మరొక వైపు విద్యార్థులను రకరకా లుగా పాఠశాలలకు రప్పించే పని అధికారులు చేస్తున్నారని వారు RJD గారితో అన్నారు.
చాలా మండలాలలో ఉపాధ్యా యుల సర్వీస్ రిజిస్టర్ల ను తాజా పర్చ లేదని,ఆపని వెంటనే చేసి,వాటిని ఎలెక్ట్రానిక్ సర్వీస్ రిజిస్టర్లు గా చేసే బాధ్య త మండల విద్యాధి కారులకే అప్పగించాలని వారు RJD గా రికి విన్న వించారు.
పాపిలి మండలం గోపాలనగరం లో పని చేసే ఉపాధ్యాయునిపై కొంతమంది యూనియన్ పర మైన వివాదాలు పరిగణనలోకి తీసుకొని ఫిర్యాదు చేశారని, నిజానిజాలు తేల్చడం కోసం విచారణ కమిటీ వేయాలని, నిజాలు నిగ్గు తేల్చాలని వారు డిమాండ్ చేశారు.
Comments
Comments are closed.