జిల్లా విద్యాశాఖాధికారికి ప్రాతినిధ్యం
11.06.2020: 2020 డియస్ సి నియామకాలు ఒకేసారి జరగలేదు. అంతర్రాష్ట్ర సర్టిఫికేట్లు చెల్లవనే కారణంతో నిలుపుదల చేయుట జరిగింది. తిరిగి కోర్టు ఉత్తర్వుల ప్రాప్తికి జి.ఓ.నం.111, తేదీ.28.11.2007న పాఠశాల విద్యాశాఖ ఆదేశాల ప్రకారం దశలవారీగా నియామకాలు జరిగాయి.
2002 డియస్ సిలో పొందిన మార్కులు ఆధారంగా నియామకం జరిగింది. అందువలన ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ సర్వీసు రూల్స్ 33(1)(బి) ప్రకారం పై నుదహరించిన ఉత్తర్వల ప్రాప్తికి పూర్తి వివరాలతో కూడిన రిపోర్టును విద్యాశాఖకు పంపించి నోషనల్ సీనియార్టీ ఇప్పించుటకు తగు చర్యలు తీసుకోవాలని కోరడమైనది.
ఈ కార్యక్రమంలో యుటియఫ్ రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్, జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు పొందూరు అప్పారావు, రెడ్డి మోహనరావు, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు ఎస్. కిషోర్ కుమార్ పాల్గొన్నారు.
Comments
Comments are closed.