మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం
అనంతపురం అర్బన్ 13.06.2020
అనంతపురం అర్బన్ యం.ఎల్.ఎ.అనంత వెంకట రామిరెడ్డి గారికి పి.ఆర్.సి.అమలు,సి.పి.యస్.రద్దు అంశాలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళలని వినతిపత్రం ఇస్తున్న యు.టి.ఎఫ్.నాయకులు.
అనంతపురం జిల్లాలో ఇప్పటి వరకు
1) అనంతపురం అర్బన్ యం.ఎల్.ఎ.అనంత వెంకట రామిరెడ్డి గారికి
2) ధర్మవరం యం.ఎల్.ఎ.కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి గారికి
3) రాయదుర్గం యం.ఎల్.ఎ కాపు రామచంద్రా రెడ్డి గారికి
4) అనంతపురం యం.పి తలారి రంగయ్య గారికి వినతిపత్రాలు ఇవ్వడమైనది .
అనంతపురం యు టి ఎఫ్ జిల్లా శాఖ… రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు సి పీ ఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, పదకొండవ పిఆర్సి ని వెంటనే అమలు జరపాలని శ్రీయుతులు ఎం శంకర్ నారాయణ గారు బీసీ సంక్షేమ శాఖ మాత్యులు ద్వారా గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యుల కు తెలియజేయాలని మంత్రి గారికి యు టి ఎఫ్ డిమాండ్లను వ్యక్తిగతంగా ఫోన్ లో వివరించి యు టి ఎఫ్ వినతి పత్రాన్ని జిల్లా శాఖ పక్షాన మంత్రి గారికి మెయిల్ చేయడం జరిగింది.. మంత్రిగారు సానుకూలంగా స్పందిస్తూ తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని తెలియజేశారు… ఉద్యమ అభినందనలతో….. యుటిఎఫ్ జిల్లా శాఖ అనంతపురం… ( మంత్రిగారు జిల్లాలో అందుబాటులో లేకపోవడం వల్ల వ్యక్తిగతంగా సంభాషించి, మెయిల్ చేయడం జరిగినది)…
Comments
Comments are closed.