మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం
మార్కాపురం 14.06.2020
మార్కాపురం ప్రాంతీయ మండలాల ఆధ్వర్యంలో ఎన్నికల ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీ సిపిఎస్ ను వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని, 11వ prc ను తక్షణమే అమలు చేయాలని ఉపాధ్యాయ బదిలీలు చేపట్టాలని ,నాడు నేడు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై మార్కాపురం శాసన సభ్యులు శ్రీ కుందురు నాగార్జున రెడ్డి గారికి వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యేగా ఏడాది కాలం పూర్తి చేసుకున్నందున వారికి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా నాగార్జున రెడ్డి గారు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఓవి వీరారెడ్డి, జిల్లా కార్యదర్శి బి శ్రీరాములు, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు వెన్న వెంకట్ రెడ్డి జిల్లా కుటుంబ సంక్షేమ పథకం డైరెక్టర్ ఎస్ కే ఎన్ కాసిం పీరా, మార్కాపురం తర్లుపాడు పెద్దారవీడు మార్కాపురం టౌన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు సీనియర్ కార్యకర్తలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Comments are closed.