మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం
బద్వేలు 15.06.2020
PS రద్దు, PRC అమలు పై చర్యలు చేపట్టాలి
MLA, MLC లకు బద్వేలు UTF శాఖ వినతి
CPS విధానాన్ని, రద్దు చేయడంతో పాటు PRC ని అమలు చేసి ఈ బడ్జెట్ లోనే PRC అమలుకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ప్రజా ప్రతినిధులకు వినతి పత్రం సమర్పించాలని UTF రాష్ట్ర కమిటి ఇచ్చిన పిలుపు మేరకు UTF బద్వేలు శాఖ ఆధ్వర్యంలో బద్వేలు నియోజకవర్గ శాశనసభ్యులు డాక్టర్.జి.వెంకట సుబ్బయ్య, శాసన మండలి సభ్యులు శ్రీ డి.సి.గోవిందరెడ్డి గార్లకు ఈ రోజు (15.06.2020) వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. ప్రభుత్వం దృష్టికి తీసుకవెళ్ళి సమస్యలను పరిష్కరించాలని UTF చేసిన విఙ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన MLA, MLC లు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకవెళ్ళి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో UTF జిల్లా గౌరవాధ్యక్షుడు యస్.ఓబుళ్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాదన విజయ కుమార్, జిల్లా కార్యదర్శి యస్.శశిధర్ కుమార్, బద్వేలు మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.గురు ప్రసాద్, టి.శివ ప్రసాద్, ట్రెజరర్ శ్రీనివాసులరెడ్డి, గోపవరం మండల ప్రధాన కార్యదర్శి సి.కంచిరెడ్డి, ట్రెజరర్ రామ చంద్రయ్య, జిల్లా కౌన్సిలర్లు పి.వి.చంద్రశేఖర్, పి.శ్రీనివాసులరెడ్డి, పి.చక్రపాణి, దస్తగిరి, కె.థామస్ ఫ్రాన్సిస్ బాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Comments are closed.