డిఇఓ గారికి ప్రాతినిధ్యం
శ్రీకాకుళం జిల్లాలో మెలియాపుట్టి, పాతపట్నం, సారవకోట మండలాల్లో నాడు-నేడు పనులూ “ఆదిలీలా పౌండేషన్” కు ప్రభుత్వం అప్పగించడమైనది ఆ సంస్థ వారు నేటి వరకు ఒక్క పాఠశాలలోనూ మనబడి నాడు-నేడు పనులు ప్రారంభించలేదు.
కమిషనర్ గారి ఉత్తర్వులు మేరకు నాడు నేడు పాఠశాలలు జూలై 13 నుండి 31 వరకు అందరూ ఉపాధ్యాయులు హాజరు కావాలని ఆదేశించారు. కానీ ఈ మూడు మండలాల్లో నాడు నేడు ప్రారంభం కానందున ఉపాధ్యాయుల హాజరు మినహాయించాలని,జిఒ నెం 145 మేరకు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ప్రతి మంగళవారం, ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ప్రతి సోమ, గురు వారాలు పాఠశాలకు హాజరు కాగలరని నాడు-నేడు పనులు ఆ మూడు మండలాల్లో వెంటనే ప్రారంభించాలని కోరుతున్నాము, ప్రారంభమైన రోజు నుంచి ప్రతిరోజు హాజరై పనులను పరిరక్షణ చేయుదమని తెలియజేయుచున్నాము.
ఆ మండలాల నాడు-నేడు పాఠశాలకు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వవలసినదిగా మరియు కరోనా ఉద్రితమైన నేపథ్యంలో 144 సెక్షన్ అమలులో ఉన్న నందున పాఠశాలకు ఒంటిపూట నిర్వహించేందుకు అనుమతి కోసం గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి కుసుమ చంద్రకళ గారికి వినతి పత్రంను యుటిఎఫ్ జిల్లా కమిటీ పక్షాన అందజేసిన రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్, జిల్లా అధ్యక్షులు పొందూరు అప్పారావు గారు. ఈ సందర్భంగా డి ఇ ఓ గారు మాట్లాడుతూ దీనిపై కమిషనర్ గారి వివరణ కోరుతానని తెలియజేశారు.
Comments
Comments are closed.