మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం
శృంగవరపుకోట 14.06.2020
సిపిఎస్ రద్దుకై అభ్యర్థన
గౌరవ శృంగవరపుకోట శాసనసభ్యులు శ్రీ కడుబండి శ్రీనివాస రావు గారిని నియోజక వర్గంలో ఉన్న మండలాల యూటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, UTF విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి J.A.V.R.K. ఈశ్వరరావు గారి ఆధ్వర్యంలో కలవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి ఈశ్వర రావు గారు మాట్లాడుతూ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో ఉద్యోగుల కోసం ఇచ్చిన ప్రధానమైన హామీలైన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు మరియు పి ఆర్ సి అమలు గురించి వచ్చే శాసనసభ సమావేశాలలో తెలియపరిచి సాధ్యమైనంత త్వరగా C.P.S రద్దుకై చర్యలు తీసుకొన వలసినదిగా కోరడమైనది. ఈ కార్యక్రమంలో జిల్లా సహాధ్యక్షురాలు పార్వతి గారు, యు టి ఎఫ్ వేపాడ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఇమంది. జగదీష్, రావాడ రామ సత్యం , యు టి ఎఫ్ .ఎల్ కోట అధ్యక్షురాలు బి దేవుడమ్మ, యుటిఎఫ్ కొత్తవలస అధ్యక్షురాలు నిర్మలా దేవి, T వినోద్, జామి utf ప్రధాన కార్యదర్శి ch. తిరుపతినాయుడు , ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Comments are closed.